ఏపీ ప్రజల జీవనాడి పోలవరం - ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
The bullet News ( Polavaram) _ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రపదేశ్ ప్రజలకు గొప్ప వరమని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీబాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.. పోలవరాన్ని ఇవాళ మంత్రులు లోకేష్, దేవినేని ఉమ, పరిటాల సునీత, జవహర్ లతో కలిసి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు నీరవ్వవచ్ఛన్నారు.. రాయలసీమను రతనాల సీమగా చూసేందుకు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారన్నారు.. దాంతో పాటు కృష్ణా డెల్టా మూడు పంటలకు నీరు సమృద్ఢిగా అందుతుందనన్నారు. చంద్రబాబు ఆంద్రరాష్ట్ర అభివృద్ది కోసం పని చేస్తుంటే కొందరు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.. యాత్రల పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.. జగన్ చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మొద్దని ఆయన ప్రజల్ని కోరారు..
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం - ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
Reviewed by ADMIN
on
November 18, 2017
Rating:
No comments: