కక్షలు వీడి రాజీమార్గం ఎంచుకోండి..- లోక్ అదాలత్ జిల్లా జడ్జి
THE BULLET NEWS (NELLORE)- జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం డిసెంబర్ 9న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా లోక్ అదాలత్ జడ్జి పీజే సుధా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షలువీడి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. క్రితం సారి ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ద్వారా దాదాపు 800 కేసులు జిల్లా వ్యాప్తంగా రాజీ చేశామన్నారు.. ముఖ్యంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు
మోటార్ వాహనాల పరిహారపు కేసులు వంటివి పరిష్కరించబడుతాయన్నారు.. నేషనల్ సర్వీసెస్ లీగల్ అథారిటి వారి ఆదేశాలనుసారం జరుగబోతున్న ఈ కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.. చెక్ బౌన్స్ కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చేలా ఉందన్నారు.. ఈ కేసుల్లో ఉన్న వారు చెక్ అమౌంట్ తో పాటు కోర్టు ఖర్చలును డిపాజిట్ చేసిన యెడలా వారు రాజీ చేసుకోవచ్చన్నారు..
మోటార్ వాహనాల పరిహారపు కేసులు వంటివి పరిష్కరించబడుతాయన్నారు.. నేషనల్ సర్వీసెస్ లీగల్ అథారిటి వారి ఆదేశాలనుసారం జరుగబోతున్న ఈ కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.. చెక్ బౌన్స్ కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చేలా ఉందన్నారు.. ఈ కేసుల్లో ఉన్న వారు చెక్ అమౌంట్ తో పాటు కోర్టు ఖర్చలును డిపాజిట్ చేసిన యెడలా వారు రాజీ చేసుకోవచ్చన్నారు..
కక్షలు వీడి రాజీమార్గం ఎంచుకోండి..- లోక్ అదాలత్ జిల్లా జడ్జి
Reviewed by ADMIN
on
November 21, 2017
Rating:
No comments: