అంగన్వాడీ స్కూల్స్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
The Bullet News ( Manubolu ) _ అంగన్వాడీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట కార్యదర్శి తులసి యాదవ్ డిమాండ్ చేశారు.. మనుబోలు మండలం కొండూరు సత్రం అంగన్ వాడి స్కూల్ కి పంచాయతి నిధులతో ఫాన్స్, లైట్స్ ఎంపిడిఓ అందజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తులసి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవన దుస్థితిని కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలియజేశామన్నారు.. త్వరలోనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు..కాకాణి నాయకత్వంలొనే కొండూరు సత్రం పంచాయతీ అభివృద్ధి చెందు తోందన్నారు..కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసులు రెడ్డి, సెక్రటరీ వెంకటరమయ్య, కోవూరు అమరావతి, ఆవుల విజయమ్మ, దాసరి భారతి పాల్గొన్నారు..
అంగన్వాడీ స్కూల్స్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Reviewed by ADMIN
on
November 17, 2017
Rating:
No comments: