పెన్షన్లలో రాజకీయాలొద్దు... త్వరితగతిన అందజేయండి - రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
The Bullet News ( Nellore ) _ 'నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా.. పెన్షన్ అందడం లేదని వితంతువులు, వృద్దులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 65 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆటోమోటిక్ గా ఫించన్ అందేలా చూడాలి.. వితంతువులకు కూడా త్వరితగతిన ఫించన్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి' అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.. మన ఎమ్మెల్యే- మన ఇంటికి కార్యక్రమంలో భాగంగా ఇవాళ యూకోనగర్, గుండ్లపాలెం, బాబానగర్ కాల్వ కట్ట ప్రాంతాల్లో ఉదయం గం.6 నుంచే పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ పించన్ల కోసం వృద్దులు, వితంతువులు ఎదురుచూస్తున్నారన్నారు. పించన్ల కోసం ఎవరి చుట్టూ తిరక్కుండా ఆటోమోటిక్ గా పించన్ల మంజూరు విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.. పించన్ల విషయంలో రాజకీయాలు తగవన్నారు.. వికలాంగులకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి గుర్తింపు మరియు పంపిణీ చేపట్టాలన్నారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..
పెన్షన్లలో రాజకీయాలొద్దు... త్వరితగతిన అందజేయండి - రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
Reviewed by ADMIN
on
November 17, 2017
Rating:
No comments: