గూడూరులో ఘనంగా ప్రారంభమైన సైన్స్ ఫెయిర్..

The Bullet News ( Gudur) _ విద్యార్దుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ వంటి మంచి కార్యక్రమాలు దోహదపడుతాయని వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా అన్నారు.. గూడూరు డివిజన్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి విద్యార్దులు, ఉపాధ్యాయుల నుంచి అనూహ్య స్పందన లభించింది.. ఈ సందర్భంగా దొంతు శారదా మాట్లాడుతూ పుస్తక పఠనం కంటే ప్రయోగాల ద్వారానే విషయంపై అవగాహన పెంచుకోవచ్చన్నారు.. చిన్నతనం నుంచే సృజనాత్మకతను అలవరుచుకోవాలని ఆమె విద్యార్దులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం గూడూరు మునిసిపల్ చైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ మాట్లాడుతూ 87 వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టుల రూపంలో దాదాపు 380 మంది హాజరవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు.. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఏబీవీపి నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. అనంతరం డిప్యూటీ డిఈవో రహంతుల్లా, రాష్ట కార్యదర్శి మల్లికార్జున మాట్లాడారు.. అతిథులందరూ కలిసి ఎగ్జిబిషన్ ను తిలకించారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొంతు గోపి, హెచ్ ఎం రవూప్, ఏబీవీపీ డివిజన్ కార్యదర్శి మనోజ్, నగర కార్యదర్శి చిన్నా, రవి తదితరులు పాల్గొన్నారు..
గూడూరులో ఘనంగా ప్రారంభమైన సైన్స్ ఫెయిర్..
Reviewed by ADMIN
on
November 17, 2017
Rating:
No comments: