అందరి సహకారంతో సర్వేపల్లిని అభివృద్ది చేస్తా - నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజా
The Bullet News ( Podalakuru )_ పొదలకూరు మండలం పార్లపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు.. స్థానిక నేతలు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.. అనంతరం సోమిరెడ్డి రాజా మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు నచ్చి ప్రతిపక్ష వైసీపీ నుంచి తమ పార్టీలోకి వలసలు వస్తున్నారన్నారు.. వైసిపి నుంచి టిడిపీలో చేరిన గూడూరు సీతారామయ్య, వెన్నపూస. విజయ్ రెడ్డి, వడ్లపూడి. పెంచలయ్య, కొట్టే. రమేష్, నీలి. వెంకటేశ్వర్లు, చెంగన. కృష్ణయ్య, పటికినేటి. చిన పెంచలయ్య మరియు 50 కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. అందరి సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు..
అందరి సహకారంతో సర్వేపల్లిని అభివృద్ది చేస్తా - నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజా
Reviewed by ADMIN
on
November 17, 2017
Rating:
No comments: