కమల్ .. కాళ్లు విరగొడతాం... నోరు అదుపులో పెట్టుకో- బిజేపీ నేతల వార్నింగ్
The bullet news (Nellore)- సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. బిజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెడుతున్నాయి.. కమల్ కు వ్యతిరేకంగా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి.. నెల్లూరు నగరంలో బిజేపీ నేతల ఆధ్వర్యంలో కమల్ దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజేపి నేతలు మిడతల రమేష్, సురేష్ నాయుడు, శ్రీనివాసరెడ్డి, నాయకులు జగన్మోహన్ రావులు కమల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల్లోనే ఎక్కువగా ఉగ్రవాదులున్నారని ఆయన కామెంట్ చే్యడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శమన్నారు.. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో బిజేపీ విశేష కృషి చేస్తుంటే ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు.. ఒకరిని పొగడాలంటే మరొకరిని తిట్టాలి అనే ధోరణిలో కమల్ మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు.. కమల్ వైఖరి ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.. గాంధీబొమ్మ సెంటర్ లో కమల్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు..
కమల్ .. కాళ్లు విరగొడతాం... నోరు అదుపులో పెట్టుకో- బిజేపీ నేతల వార్నింగ్
Reviewed by ADMIN
on
November 03, 2017
Rating:
No comments: