అమరావతిలో మంత్రి ఆదినారాయణ రెడ్డిని కలిసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల, ఏఎంసీ చైర్మన్
The bullet news (Amaravathi)- వెంకటగిరి నియోజకవర్గంలో పలు అభివ్రుద్ది పనుల కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రుష్ణ సంబంధిత మంత్రులకు కలుస్తున్నారు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిజిగా ఉన్న ఎమ్మెల్యే అదే సమయంలో మంత్రులకు కలుస్తూ తన నియోజకవర్గ అభివ్రుద్దికి తోడ్పాటునందించాలని కోరుతున్నారు..బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో దాదాపు రూ. 3 కోట్లతో నూతనంగా నిర్మించబోయే, మార్కెటింగ్ గోడౌన్లకు ల్యాండ్ క్లియరెన్స్ మరియు వెంకటగిరి ఏ.ఎం.సి. గిడ్డంగుల సముదాయము ఆవరణలో సీసీ రోడ్ల కోసం నిధులను మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆదినారాయణరెడ్డిని కలిశారు.. అదే విధంగా డక్కిలి మండలంలో.. నూతన పశువైద్యశాల ఏర్పాటుకు వినతి పత్రం అందజేశారు.. వీటన్నింటిని పరిశీలించిన మంత్రి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తానని హామీ అచ్చారు.. అలాగే నూతన పశువైద్యశాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు.. మంత్రిని కలిసిన వారిలో ఏ.ఎం.సి. ఛైర్మెన్ పులుకొల్లు రాజేశ్వరరావు ఉన్నారు..
అమరావతిలో మంత్రి ఆదినారాయణ రెడ్డిని కలిసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల, ఏఎంసీ చైర్మన్
Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: