జగన్ ముఖ్యమంత్రి అయితే ముస్లీములకు మహర్దశ - మాజీ మంత్రి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి
The bullet news (Kovuru)- ముస్లీం,మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి, క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక్క దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి,వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా నిర్వహిస్తున్న పల్లె నిద్రలో భాగంగా ఇందుకూరుపేట మండలం, గంగ పట్నం పంచాయతీ,కాలవములగా కండ్రిగలొ ఆయన మాట్లాడారు.. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత వైఎస్సార్ దేనన్నారు.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు శాతం పెంచేందుకు కమీటి వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.. ముస్లీము సోదరులకు మహర్దశ రావాలంటే ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు నాయుడు ముస్లీములను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు.. ముస్లీములకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు.. ముస్లీముల పట్ల చంద్రబాబు నాయుడి చిత్తశుద్ది ఏపాటిదో అర్దమవుతోందన్నారు..
జగన్ ముఖ్యమంత్రి అయితే ముస్లీములకు మహర్దశ - మాజీ మంత్రి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి
Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: