దూకుడు డైలాగ్ ను ఫాలో అవుతున్న దొంగల ముఠా అరెస్టు...
The bullet News (Naidupeta)- 20 దేవాలయాలు.. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు.. లక్షల్లో నగదు చోరీలు..దేవుడికే శఠగోపం.. ఇవన్నీ వారి ట్రాక్ రికార్డ్స్... దేవాలయాలే టార్గెట్ గా దొంతనాలకుల పాల్పడుతున్న ముఠాను నాయుడు పేట పోలీసులు అరెస్టు చేశారు..వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు..
దొంగతనాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్..ఒకరు ఇళ్లలో చొరబడి దొంతనాలు చేస్తే. మరొకరు దుకాణాలు, పొలాల్లో పడి అందిన కాడిని దోచుకెళ్తుంటారు.. కానీ వీరు మాత్రం దేవుడికే శఠగోపం పెట్టే టైప్.. దాదాపు 20 దేవాలయాల్లో హుండీలను పగలకొట్టి, నగలు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేవారు.. అలాంటి ముఠాను నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు..
కేసుకు సంబంధించిన వివరాలను గూడూరు డిఎస్పీ రాంబాబు మీడియాకు వివరించారు.. నిందితులు సాలార్ ఖాన్, రవి, ధనరాజ్,వెంకటేష్ లు టెంపుల్స్ వద్ద రెక్కి నిర్వహించి అదును చూసి దొంతనాలకు పాల్పడేవారన్నా. వారి మీద ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు. సాలార్ ఖాన్ పై ఇప్పటి వరకు 10 కేసులు ఉన్నాయని వివరించారు. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట సర్కిల్ లలోని దామా నెల్లూరు, డేగావారి కండ్రిగ, కురుగొండ, గ్రద్ద గుంట, వాకాడు, దుగరాజపట్నంతో పాటు చాలా ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడ్డారన్నారు.. వారిని ఇవాళ నాయుడుపేట పోలీసులు అరెస్టు చేశారన్నారు.. సంబంధిత భాధితులు నాయుడుపేట సీఐని కలిసి వివరాలు అందజేస్తే సొమ్ము అప్పగిస్తామని తెలిపారు. సమావేశంలో సీఐ మల్లిఖార్జున్ రావు, ఎస్సైలు రవీనాయక్, వెంకటరమణ లు పాల్గొన్నారు.

Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: