హైదరాబాద్ లో 12వేలమంది పోలీసుల మోహరింపు..
THE BULLET NEWS (HYDERABAD)-నేడు ట్యాంక్ బండ్ పై టీజేసీ, పలు వామపక్ష సంఘాలు, ఇంటిపార్టీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మిలియన్ మార్చి స్ఫూర్తి సభకు పోలీసులు అనుమతి లేదని పేర్కొంటున్నారు. మిలియన్ మార్చ్ నేపథ్యంలో ట్యాంక్ బండ్ ను అధికారులు మూసివేశారు. ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ముమ్మర తనిఖీలను చేపట్టారు. నగర శివార్లలో కూడా దాదాపు 350 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి, నగరంలో 12వేలమంది పోలీసలు మోహరించారు. మాసబ్ ట్యాంక్ వద్ద వున్న ఎన్టీఆర్ఏ, లుంబినీపార్క్,సంజీవయ్య పార్క్ లను సాయంత్రం 5 గంటల వరకూ మూసివేసిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో 12వేలమంది పోలీసుల మోహరింపు..
Reviewed by ADMIN
on
March 10, 2018
Rating:
No comments: