జనసేనలో చేరిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేత
The bullet news ( Vijayawada) _ ప్రశ్నే ఆయుధంగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన జనసేన... రాజకీయ వలసలపై ఆసక్తి చూపుతోందా అంటే.. అవుననే సమాధానమొస్తోంది. తాజాగా ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరంను పార్టీలోకి ఆహ్వానించి.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణం. ఎమ్మెల్సీగా, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం మాదాసుకు ఉంది. సీనియర్ రాజకీయవేత్తగా ఆయనకు ఏపీ పాలిటిక్స్‌లో మంచి పేరుంది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సభకు డుమ్మా కొట్టకపోవడం ఆయనలో రాజకీయ నిబద్దతకు మచ్చుతునకగా జనసేన చెబుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు లేవని అంటోంది.
అయితే గతంలో ఇతర పార్టీల నాయకులకు తమ పార్టీలో చోటు లేదని జనసేన చీఫ్ పవన్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతను తమ పార్టీలోకి ఆహ్వానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఏ పార్టీనైతే తీవ్రంగా విమర్శించి.. కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో అన్నారో ఆపార్టీ నాయకులే జనసేనకు కావల్సి వచ్చిందా అన్న ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. అయితే మాదాసు కూడా గతంలో పవన్ కల్యాణ్‌కు బహిరంగంగానే మద్దతుగా నిలిచారు. పవన్ రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నామంటూ పీసీసీ వేదికగా ప్రకటించారు. అదే మాదాసు ఇప్పుడు పార్టీలోకి రావడానికి ప్రధాన కారణమైందని తెలుస్తోంది.
జనసేనలో చేరిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేత
Reviewed by ADMIN
on
March 09, 2018
Rating:
No comments: