Top Ad unit 728 × 90

సీబీఎన్ పాలిటిక్స్ @40

THE BULLET NEWS (AMARAVATHI)-ప్రజాజీవితంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. తన సుదీర్ఘ రాజకీయ జీవింతంలో అనేక ఆటుపోట్లను చూశానన్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ను, రాజకీయ విజయాలను ఇచ్చిన ప్రజలను తన జీవితంలో మర్చిపోలేనన్నారు. ఎన్టీఆర్‌ను   తన తల్లిదండ్రులకంటే ఎక్కువగా గౌవరవిస్తానన్నారు. చంద్రబాబు 40ఏళ్ల రాజీకీయ ప్రస్థానంపై ఏపీ శాసన సభలో  ఆకస్తికర చర్చ జరిగింది.
చంద్రబాబుపై సభ్యులు ప్రశంశలు
సీఎం చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఏపీ శాసన సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు చంద్రబాబుపై ప్రశంశలు కురిపించారు. నాలుగు దశాబ్దాలుగా పాలిటిక్స్‌లో ఎదురులేకుండా సాగుతున్న చంద్రబాబు జీవితం యువ రాజకీయనాయకులకు స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు.
ప్రజలకు సేవచేయడమే సంతృప్తి : సీఎం చంద్రబాబు
తనకు కుటుంబం కంటే.. ప్రజలకు సేవచేయడమే సంతృప్తి ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాను ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టానని.. స్వయంకృషి, పట్టుదలతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానన్నారు. తనకు రాజకీయాలు నేర్పంది ఎన్టీఆర్‌ అయితే.. రాజీకీయ జీవితాన్ని ఇచ్చింది ప్రజలే అన్నారు. తనకు ఎవరూ బాస్‌లు లేరని.. ప్రజలనే బాస్‌లు అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం సాగుతున్నపోరాటాన్ని కొందరు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారికి  జనమే సమాధానం చెబుతారని చంద్రబాబు అన్నారు.
వైసీపీ కొత్త లాలూచీ రాజకీయాలు : సీఎం చంద్రబాబు
అటు పార్లమెంటులో అవిశ్వాసం పేరుతో వైసీపీ కొత్త లాలూచీ రాజకీయాలకు తెరతీసిందని.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరు పోరాడినా మద్దతిస్తామని.. అదే సమయంలో రాజకీయ స్వార్థాలను కూడా ఎండగడతామన్నారు. ఇక  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తనపై చేసిన విమర్శలను చంద్రబాబు పరోక్షంగా తిప్పికొట్టారు. తనపై విమర్శలు చేసే వ్యక్తులు ఓసారి ఆలోచించుకోలన్నారు. ప్రధాని మోదీ మోసం చేశారని తాను పోరాటం చేస్తుంటే.. తనను బలపరచాల్సిందిపోయి..ఇలా విమర్శలకు దిగడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.
యువతకూ చంద్రబాబు ఆదర్శం : లోకేష్
చంద్రబాబు నలబైఏళ్ల రాజకీయ జీవితం తనతోపాటు ప్రస్తుతం యువతకూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి లోకేశ్‌. జీవితంలో ఎన్నో సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న నేతగా చంద్రబాబు తనకు ఎన్నటికీ గర్వకారణమే అన్నారు లోకేశ్‌..
చంద్రబాబుపై విష్ణుకుమార్‌రాజు చలోక్తులు
చంద్రబాబు రాజకీయ జీవితంపై సభలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు.. తన చలోక్తులతో నవ్వులు పూయించారు. చంద్రబాబు సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్నపుడు తాము మూవీ టెక్కట్లకోసం ఆయనతో సిఫార్స్‌ లెటర్‌ తెచ్చుకోడానికి పడిన తపనను ఆసక్తికరంగా వివరించారు. చంద్రబాబు యూత్‌లోనూ, ఇప్పడూ  గ్లామర్‌గా గానే ఉన్నారన్న విష్ణుకుమార్‌రాజు మాటలతో సీఎం చంద్రబాబుతో సహా సభయావత్తు నవ్వులతో నిండిపోయింది.
ప్రజల సేవలలోనే కొనసాగుతా : సీఎం
నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసమే తాను రాజకీయాలు చేశానన్న చంద్రబాబు.. ఇక ముందు కూడా ప్రజల సేవలలోనే కొనసాగుతానన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి పెద్దకొడుకుగా  అండగా ఉంటానన్నారు.   ఏపీని కష్టాల నుంచి బయటపడేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తాన్నన్నారు.
సీబీఎన్ పాలిటిక్స్ @40 Reviewed by ADMIN on March 15, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.