టార్గెట్ డిల్లీ... హస్తినకు బయల్దేరిన నెల్లూరుజిల్లా వైసీపీ విద్యార్ది విభాగం నాయకులు
The bullet news (Nellore)- ప్రత్యేకహోదా అంధ్రుల హక్కంటూ నినదిస్తున్న వైసీపీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.. ఈనెల 5న డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యులు, విద్యార్దివిభాగం నాయకులు ధర్నా నిర్వహించనున్నారు.. అందులో భాగంగా ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్ది విభాగం నాయకులు డిల్లికి బయల్దేరారు.. పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నపనేని పెంచలనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, విద్యార్దులు ఇవాళ డిల్లికి బయల్దేరారు.. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పెంచల నాయుడు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదానే లక్ష్యంగా చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని అదే ఊపులో డిల్లీలో కూడాధర్నా ను విజయవంతం చేసేందుకు విద్యార్దులు, యువత డిల్లికి బయల్దేరుతున్నామన్నారు.. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆదేశాలతో డిల్లీ వెళ్తున్నామని ఏపీ ప్రజల వాణిని ఢిల్లికి వినిపిస్తామన్నారు.. డిల్లీకి బయల్దేరిన వారిలో నాయకులు వెంకటేష్, శంకర్ , ఆదామ్ తదితరులున్నారు..
టార్గెట్ డిల్లీ... హస్తినకు బయల్దేరిన నెల్లూరుజిల్లా వైసీపీ విద్యార్ది విభాగం నాయకులు
Reviewed by ADMIN
on
March 03, 2018
Rating:
No comments: