Top Ad unit 728 × 90

కోవూరులో అజ్ణాత సైకో- భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

The bullet news (Kovuru)- ప‌గ‌లు క‌నిపించ‌డు.. అర్ద‌రాత్రులు సంచ‌రిస్తాడు.. ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు తెగ‌బ‌డ‌తాడు.. అత్యాచారాల‌కు పాల్ప‌డ‌తాడు..అక్క‌డి నుంచి ప‌రార‌వుతాడు.. ఇలా రెండు రోజుల నుంచి కోవూరులో ఓ అజ్ణాత సైకో కోవూరు ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాడు..
కోవూరు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ సైకో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఓ వృద్ద మ‌హిళ‌ను అత్యాచారం చేశాడు.. తీవ్ర ర‌క్త‌స్రావంతో ప‌డున్న ఆమెను చుట్టుప‌క్క‌ల వారు నెల్లూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.. అదే రోజు కోవూరులోని మ‌రో ప్రాంతంలోని ఓ వృద్దురాలిపై దాడి చేశాడు.. దీంతో ఆమె కూడా నెల్లూరులోని ఓ ప్ర‌యివేట్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతుంది.. బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదు చేసి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు.. త్వ‌రలోనే అజ్ణాత సైకోను ప‌ట్టుకుంటామ‌ని ఎస్ ఐ వెంక‌ట్రావ్ తెలిపారు.. మ‌రోప‌క్క కోవూరులో ఇవాళ ఎస్పీ పిహెచ్ డీ రామ‌కిష్ణ ప‌ర్య‌టించారు.. కేసు సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్న ఆ సైకోను వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని సిబ్బందిని ఆదేశించారు..
కోవూరులో అజ్ణాత సైకో- భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు Reviewed by ADMIN on March 02, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.