లెనిన్ విగ్రహ కూల్చివేతపై వామపక్షాల ఆగ్రహం- నెల్లూరులో దర్నా
The bullet news (Nellore)_ త్రిపులో లెనిన్ విగ్రహ ధ్వంసానికి నిరసనగా నెల్లూరులో సీపీఎం నాయకులు ఆందో్లన నిర్వహించారు.. నగరంలోని గాంధీబొమ్మ నుంచి విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.. త్రిపురలోఅధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ నాయకులు కమ్యూనిస్టులపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చండ్రా రాజగోపాల్ మాట్లాడుతూ బిజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన బిజేపీ అక్కడుంటే కమ్యూనిస్టు నాయకులు విగ్రహాలను కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు.. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు..
లెనిన్ విగ్రహ కూల్చివేతపై వామపక్షాల ఆగ్రహం- నెల్లూరులో దర్నా
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: