జగన్ వ్యక్తిత్వం గొప్పది..- విపిఆర్ కామెంట్
The bullet news ( Amaravathi)_ జగన్ వ్యక్తిత్వం గొప్పదని.. అలాంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉందని వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.. అమరావతి లో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఓ రియల్ హీరో అన్నారు.. ఆయన అడుగుజాడల్లోనే వైసీపీ అధినేత జగన్ నడుస్తున్నాడన్నారు..జగన్ 125 సంవత్సరాల కాంగ్రెస్ తో, 40 సంవత్సరాల టీడీపీ తో పోరాటం చేస్తున్నాడని ఆయనకి మేము అండగా ఉంటామన్నారు..జగన్ లాంటి నాయకత్వ లక్షణాలు ఏ నాయకుడికి లేవని ఆయన అభిప్రాయపడ్డారు..రాజశేఖర్ రెడ్డి కి, విజయమ్మ కి జగన్ లాంటి కొడుకు పుట్టటం వాళ్ళ అదృష్టమని ఆయన వెల్లడించారు..జగన్ కోసం తాను ఒక సైనికుడు గా పని చేస్తానన్నారు...
జగన్ వ్యక్తిత్వం గొప్పది..- విపిఆర్ కామెంట్
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: