సిఎం ప్రకటిస్తే రాజీనామాకు సిద్ధం-బిజెపి మంత్రులు
THE BULLET NEWS (AMARAVATHI)-బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని టీడీపీ, కోరిందల్లా ఇవ్వటం సాధ్యం కాదని బీజేపీ ఇలా ఎవరి పట్టువారు వీడటంలేదు. ఈ క్రమంలో ఏపీ సర్కారులో మంత్రులుగా వున్న బీజేపీ నేతలు తమ మంత్రి పదవులకు వీడ్కోలు పలికే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. విభజన హామీలను నెరవేరుస్తారనే ఆశతో ఇప్పటి వరకూ వున్న టీడీపీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితులు నెలకొంటున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ వైఖరిపై నిరసనతో వున్న సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ లో వున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేసే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కామినేనికి హైకమాండ్ నుండి ఆదేశాలు అందాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నట్లు సమాచారం.
సిఎం ప్రకటిస్తే రాజీనామాకు సిద్ధం-బిజెపి మంత్రులు
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: