త్రిపురలో పాతికేళ్ల వామపక్షాల పాలనకు శుభంకార్డు..!!
The bullet news (political news)- త్రిపురలో పాతికేళ్ల వామపక్షాల పాలనకు శుభంకార్డు పడింది. అక్కడ బీజేపీ మూడింట రెండొంతుల మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. అత్యంత పేద ముఖ్యమంత్రిగా, నిజాయతీ పరుడిగా మాణిక్ సర్కార్‌కు పేరున్నా.. వామపక్షాల్ని ప్రజలు తిరస్కరించారు. కేరళలో సంఘ్ పరివార్‌పై దుర్మార్గాలకు పాల్పడుతున్న లెఫ్ట్ ప్రభుత్వానికి.. త్రిపురలో సమాధానం చెప్పాలని బీజేపీ వ్యూహరచన చేసింది. మూడేళ్లుగా కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టి.. విజయం సాధించారు. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా.. 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ 30 కాగా.. బీజేపీ కూటమి 40 చోట్ల గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బోణీ చేయలేకపోయింది.
త్రిపురలో పాతికేళ్ల వామపక్షాల పాలనకు శుభంకార్డు..!!
Reviewed by ADMIN
on
March 03, 2018
Rating:
No comments: