Top Ad unit 728 × 90

పల్లెలు.. ప్రగతి మల్లెలు

The bullet news(rapur)- కడప జిల్లా పరిధిలో 980మీటర్ల  పరిధిలో ప్రారంభించిన రైల్వే సొరంగం పనులు ఇప్పటికే  పూర్తి  కాగా నెల్లూరు జిల్లా పరిధిలోని 6.67కిమీ  పరిధిలో చేపట్టిన పనులు చివరిదశకు చేరుకున్నాయి.నెల్లూరు జిల్లా పరిధిలో రాపూరు మండలం వెలికొండల నుంచి(కలుజుగుంట దగ్గర్లో)సొరంగం పనులు ప్రారంభం కాగా కడప జిల్లాలో చిట్వేలి మండలం చీపురుపల్లి సమీపం నుంచి పనులు చేపట్టి పూర్తి చేశారు. జూన్‌కంతా పూర్తి చేసి ట్రయల్‌  రన్‌ నడిపించే  దిశగా కసరత్తు  చేస్తున్నారు.ప్రారంభించిన రెండేళ్లలోపే ఈపనులు ముగింపు దశకు చేరుకోవడం విశేషం. సొరంగం పనుల్ని మాత్రం ఎస్‌ఈడబ్ల్యూ అనే  సంస్థ రూ.40కోట్లతో  చేపట్టింది. ఫిన్‌లాండ్‌ దేశం నుంచి వివిధ రకాల కాప్‌కో,  భూమర్‌ లాంటి ఆధునాతన  యంత్రాలను రప్పించి సొరంగం  పనుల్ని ముమ్మరం చేస్తున్నారు.సొరంగం వెంబడి ఇబ్బంది అని అనిపించిన చోటంతా  ఎలాంటి లీకేజీలు గాని, కొండ పైభాగం భవిష్యత్తులో కూలకుండా  ఉండేందుకు  గ్రౌటింగ్‌, కాంక్రీట్‌ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 10శాతం కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. మార్చి చివరినాటికి సొరంగంలో కాంక్రీట్‌ పనులు పూర్తి  చేసే  దిశగా అధికారులు చేపడుతున్నారు. ఇక్కడ అధికారులు, గుత్తేదారులు, వివిధ విభాగాలకు  చెందిన  కార్మికులు, పలు  రకాల వాహనాలతో కొండకింది ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. వాహనాల రాకపోకలు అధికమయ్యాయి.

వ్యాపార లావాదేవీల విషయంలో బాగా వెనకపడ్డ రాపూరు, డక్కిలి, సైదాపురం, పొదలకూరు మండలాల్లోని వందలాది పల్లెల్లో ప్రజల జీవనవిధానం మెరుగయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈమెట్ట పల్లెల్లో జీవనోపాధి చాలా తక్కువ.వర్షాలొస్తేనే ఇక్కడ తిండి. లేకుంటే కరవుకాటకాలే. ఒక ఏడాది వర్షాలొస్తే మరో ఏడాది ఉండవు.  ఈ తరుణంలో ఇక్కడి పల్లెల్లో చాలామంది నిరుపేదలు ఇల్లు గడవక చైన్నై, విజయవాడ,నెల్లూరు, తిరుపతి లాంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లి వలస జీవనం సాగిస్తుంటారు. అయితే ఈరైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి.దీంతోపాటు త్వరలోనే రాపూరు మీదుగానే నడికూడా - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌  నిర్మాణ పనులు కూడా ప్రారంభం  కానున్నాయి. ఎప్పుడు మొదలవుతాయన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.రెండు విధాలుగా సర్వే చేశారు. ఏమార్గంలో రైల్వేలైన్‌  ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందోనన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా  పరిశీలిస్తుంది. త్వరలోనే ఈసమస్యకు మార్గం సుగమం కానుంది.

పనుల వేగం పెరిగింది
నాగరాజు, ఎస్‌ఈడబ్ల్యూ జీఎం
కృష్ణపట్నం- ఓబులవారిపల్లి  రైల్వే లైన్‌  నిర్మాణ  పనుల్ని  వేగవంతం  చేశాం. ప్రారంభించిన రెండేళ్లలోపే పురోగతి అందుకొంది. పనులు చివరి దశలో  ఉన్నాయి. జూన్‌ చివరికంతా సొరంగం వెంబడి కాంక్రీట్‌  పనులు పూర్తి చేయాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం. జూన్‌లో ట్రయల్‌ రన్‌గా  రైలును నడపాలన్న సంకల్పంతో పనులు ఊపందుకున్నాయి. ఈరైల్వే మార్గం వినియోగంలోకి వస్తే  ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కృష్ణపట్నం ఓడ¸రేవుకి దిగుమతి అయ్యే యూరియా,ఫాస్పేట్‌, బొగ్గుతోపాటు ఐరన్‌ఓర్‌,కార్‌్్ట్జ  లాంటి ఇతర ఖనిజాల  రవాణాకు ఈమార్గం ఎంతగానో దోహదపడనుంది.  ప్రయాణ  దూరం కూడా చాలా వరకు తగ్గుతుంది.
పల్లెలు.. ప్రగతి మల్లెలు Reviewed by ADMIN on March 06, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.