త్రివిధ దళాల్లో అద్భుత ఫలితాలను సాధిస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ.
THE BULLET NEWS (KARIMNAGAR)-అనతి కాలంలోనే అద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రభంజనం సృష్టిస్తుంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. త్రివిధ దళాల్లో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల్లో చాలామంది వివిధ విభాగాలలో ఉద్యోగాలను సాధించారు. ఇటీవల జరిగిన ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో టెక్నికల్ విభాగంలో 17 మంది, ఆర్మీ జనరల్ డ్యూటీలో 26 మంది, ఆర్మీ ట్రేడ్ మెన్‌లో నలుగురు, నర్సింగ్ అసిస్టెంట్‌లో ముగ్గురు, నేవి విభాగంలో 9 మంది ఉద్యోగాలు పొందారు. పలు విభాగాల్లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం పట్ల ఢిల్లీ డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ సతీష్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన సిబ్బందితో బోధన చేస్తూనే, వారి శారీరక సామర్థ్యాలకు అనుగుణంగా వ్యాయామ శిక్షణ ఇస్తున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులైన తమను ఉద్యోగులయ్యేలా తీర్చిదిద్దిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డికి, సంస్థ పూర్వవిద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
త్రివిధ దళాల్లో అద్భుత ఫలితాలను సాధిస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ.
Reviewed by ADMIN
on
March 13, 2018
Rating:
No comments: