శృంగార జీవితంలో యాలుకల పాత్ర
The bullet News ( Health)- అమ్మచేసిన కమ్మని పాయసం ఘుమ ఘుమలు హాల్లో కూర్చున్నా వస్తుందంటే అందులో వేసే యాలుక అంత మంచి వాసనకు కారణం. సువాసన భరితమైన ఈ యాలుకల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో విటమిన్స్‌తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
* రోజూ ఓ యాలుకను నోట్లో వేసుకుంటే నోటి దుర్వాసన దూరమవుతుంది.
* శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ రాత్రి పూట ఓ యాలుకను తిని గ్లాసు వేడినీరు తాగితే ఉష్ణోగ్రత పెరిగి శరీంరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.
* రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. గురక నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.
* లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. శృంగార జీవితంలో యాలుకల పాత్రని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
* చర్మ సౌందర్యానికే కాకుండా వెంట్రుకలు రాలకుండా కూడా యాలుకలు దోహద పడతాయి.
* రెండు యాలకులు, రెండు లవంగాలు, చిన్న అల్లం ముక్క, స్పూన్ ధనియాలు తీసుకుని మెత్తగా పొడి చేసి ఓ గ్లాస్ వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య తొలగిపోతుంది. ఆహారం సరిగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతుంది.
* ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వ్యాధుల నివారణలో యాలుకల పాత్ర ప్రముఖమైంది. రోజుకు మూడు, నాలుగు యాలుకలను తీసుకుని బాగా నమిలి తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శృంగార జీవితంలో యాలుకల పాత్ర
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: