లాజిక్ మిస్సైంది.. పోలీసులకు చిక్కింది..
The bullet news (Crime)- భర్త మరణిస్తే అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము చేజిక్కించుకోవచ్చు ఆపై ప్రియుడితో కలిసి జీవించొచ్చు, అనుకుందో మహిళ. చివరకు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెరియాంపట్టిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం వుండే మాతేశన్ (45) కు భార్య, ఇద్దరు మగపిల్లలున్నారు. కొద్ది రోజులుగా మాతేశన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో తనకు ఏమైనా జరిగితే భార్యా బిడ్డలు అనాధలై పోతారన్న ఉద్దేశంతో ముందుగానే తన పేరు మీద 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు. నామినీగా భార్య రేవతి పేరు నమోదు చేయించాడు. ఈ క్రమంలో జబ్బు మరింత తీవ్రమైంది.
అయితే భర్త అనారోగ్యం పాలవడంతో రేవతి పెన్నగరం ములువాడికి చెందిన జయ ప్రకాష్ (35)తో వివాహేతరసంబంధం కొనసాగిస్తోంది. భర్త పేరిట ఉన్న ఇన్సూరెన్స్ విషయం జయ ప్రకాష్ కు తెలియజేసింది. అతను మరణిస్తే 50 లక్షల రూపాయలు తనకే దక్కుతాయని దాంతో ఇద్దరం కలిసి హాయిగా జీవించవచ్చని చెప్పింది.అప్పటికే అనారోగ్యంపాలయిన మాతేశన్ ను ప్రియుడు సహాయంతో 15 రోజుల క్రితం హత్య చేసి మృతదేహాన్ని ధర్మపురి రహదారిలో డి-గుండు అనే ప్రాంతంలో పడేసారు. దీంతో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు మాతేశన్ గా గుర్తించి భార్యకు సమాచారం అందించారు. ఆమె ఏమీ తెలియనట్టుగా మృతదేహం వద్ద రోధించసాగింది. పైగా కేసును అనుమానాస్పదంగా కాకుండా అనారోగ్యంతో మృతిచెందినట్టుగా రిపోర్ట్ రాయాలని కోరింది.. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి మృతుడి చిన్నకుమారుడిని విచారించగా ఇన్సూరెన్స్ విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో రేవతిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు పోలీసులకు వెల్లడించింది రేవతి.
లాజిక్ మిస్సైంది.. పోలీసులకు చిక్కింది..
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: