చుక్కలనంటిన పూల ధరలు
The bullet news (Nellore)- పెళ్లిళ్లు, పండగలు వచ్చాయంటే పూలకు మంచి గిరాకీ. ఆధునిక హంగులు ఎన్ని అద్దినా ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో అలంకరిస్తేనే ఇల్లైన, కళ్యాణ వేదికైనా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు పూల వ్యాపారులు. మామూలు రోజుల్లో ఎలాగూ గిరాకీ ఉండదు. కనీసం పండగ పూటైనా నాలుగు డబ్బులు చూస్తామంటున్నారు పూలమ్ముకునే చిన్న చిన్న దుకాణదారులు. ఉగాది పండుగ సందర్భంగా పూల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల్లూరు నగరంలోని మార్కెట్, ఆత్మకూరు బస్టాండ్ వంటి ప్రాంతాల్లో పూల కోసం ప్రజలు కిక్కిరిసి పోతున్నారు.. మల్లి, మందారం, గులాబి, కనకాంబరాలు వంటి పూలు నిన్నటి వరకు కిలో రూ.30 అమ్మిన కేజీ పూల ధర పండుగను పురస్కరించుకుని రూ.60 నుంచి రూ.80ల వరకు చెబుతున్నారు. రేట్లు బాగా పెంచేసారని కొనుగోలు దారులు అంటుంటే.. గత ఏడాదితో పోలిస్తే తక్కువే కదా అని వ్యాపారులు అంటున్నారు.
చుక్కలనంటిన పూల ధరలు
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: