చిల్లకూరు వద్ద విద్యుత్ వైర్లను తగిలిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
The bullet news (Chillakuru)- 11కేవీ విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్దమైన ఘటన నెల్లూరుజిల్లాలోని చిల్లకూరు మండలం తిమ్మగారిపాలెం వద్ద చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.. ధాన్యం కొనుగోలు కోసం వెళుతున్న లారీ తిమ్మనగారిపాలెం వద్దకు రాగానే11కేవీ విద్యుత్ తీగలు లారీ క్యాబిన్ కు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ తో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ రాజా, క్లినర్ నాగురు కు తీవ్రగాయలు అయ్యాయి. ట్రక్కులో ఉన్న నలుగురు కూలీ లు కిందకు దూకెయ్యడంతో ప్రమాదం తప్పింది. లారీ దగ్డం అయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడ్డ వారిని గూడూరు ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కు తరలించారు.
చిల్లకూరు వద్ద విద్యుత్ వైర్లను తగిలిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
Reviewed by ADMIN
on
March 02, 2018
Rating:
No comments: