ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు
The bullet news ( Political)_ ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీయేపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎట్టకేలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీయేలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది. పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అందరి అభిప్రాయాలను తెలుసుకుని.. ఎన్డీఏకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా... ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తెగతెంపుల విషయం చెప్పారని, అంతేగాక అవిశ్వాసం కూడా టీడీపీనే పెట్టాలని ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం.
ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు
Reviewed by ADMIN
on
March 16, 2018
Rating:
No comments: