దేవునికే శఠగోపం
The bullet news(god)- మర్రిపాడు మండలం చినమాచనూరు రెవెన్యూ పరిధిలో లక్షలాది రూపాయల విలువ చేసే 63 ఎకరాల వీరాంజనేయ ఆలయ భూములున్నాయి. చినమాచనూరులో సర్వే నెంబరు 87లో 10.65, 5లో 3.27, 1లో 7.55, 34లో 10.33 ఎకరాల భూములు ఉన్నాయి. నాగరాజుపాడులో 180/1లో 74 సెంట్లు, 157/3లో 327, 145/1లో 50 సెంట్లు, 50/1లో ఒక ఎకరా, 31/2లో 1.21, 143/3లో 1.6, 165/19లో 54 సెంట్ల భూములున్నాయి. కదిరినేనిపల్లిలో 41/1లో 3.36, 123లో 2.54, 6లో 6.3, నెర్ధనంపాడులో 6 ఎకరాలకు పైగా ఆలయ భూములున్నాయి. ఈ భూములు దేవాదాయ శాఖలో చేరి ఉన్నాయి. ప్రతి సంవత్సరం భూములకు లీజు వేలం నిర్వహించాల్సి ఉంది. ఎవరు ఎక్కువ పాడుకుంటే వారు సాగు చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాలుగా వేలం వేయకుండానే బడా రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖాధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వేలం వేసినా పలుకుబడిగల వారికే నామమాత్రంగా ఎకరం రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరిష్టానుసారంగా వారు ఈ పొలాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చినమాచనూరులోని సర్వేనెంబరు 87లో 10.65 ఎకరాల భూమిని కొందరు బడా రైతులకు అమ్ముకున్నట్లు తెలిసింది. అందులో జామాయిల్ సాగు కూడా చేశారు. గతంలో ఒక దాత ఆలయానికి ఆ భూమిని దానం చేశారు. అది మూడు చేతులు మారింది. , ఆలయకమిటీ ఛైర్మన్
ఆలయ భూములు వేలం వేసి మూడేళ్లయింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు పట్టించుకోవడం లేదు. 11 సంవత్సరాలుగా ఆలయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నా. అంత భూమికి ఏడాదికి రూ. 18 వేలు మాత్రమే లీజు వస్తోంది. ఆలయ భూమిని అమ్ముకున్నారు. 2013లో వీరాంజనేయ స్వామి పేరు మీద భూములున్నాయి. నాలుగేళ్లకు వేరే వారి పేరు మీద మారిపోయాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కొనుగోలు చేసిన వారు జామాయిల్ సాగు చేశారు. తెలుసుకొని కోతలు కోయవద్దని గ్రామస్థులతో కలసి పొలంలోకి వెళ్లి అడ్డుకున్నాం. కోతలు నిలిపివేస్తామని చెప్పి తెలియకుండా రెండు కోతలు కోసి సొమ్ము చేసుకున్నారు.

Reviewed by ADMIN
on
March 16, 2018
Rating:
No comments: