అధికారంలోకి వచ్చారు.. కూల్చేశారు
The bullet news ( Tripura) _ బీజేపీ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు.
త్రిపురలో 25 ఏళ్ల సీపీఎం పాలన ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరిగింది.
ఒక ఎక్స్‌కవేటర్‌తో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినట్లు ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఈ ఎక్స్‌కవేటర్‌ను బీజేపీ కార్యకర్తలు అద్దెకు తీసుకున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
రాజధాని అగర్తలాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణం నడిబొడ్డున ఉన్న లెనిన్ విగ్రహాన్ని కూల్చేస్తున్నపుడు 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారు.
దాంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇప్పటివరకు నాలుగు చోట్ల హింస జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు.

Reviewed by ADMIN
on
March 06, 2018
Rating:
No comments: