వచ్చే ఏడాది జూన్ లోనే సాగునీరు-చంద్రబాబు
THE BULLET NEWS (AMARAVATHI)-వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా, గోదావరి డెల్టాలకు జూన్‌లోనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పన నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ వరకు అన్నింటిపైనా కేంద్రం సమీక్షించుకోవాలని సూచించారు. ఎగుమతులు, దిగుమతుల్లో హేతుబద్ధ విధానాలు ఉండాలని అసెంబ్లీలో చెప్పారు.
వచ్చే ఏడాది జూన్ లోనే సాగునీరు-చంద్రబాబు
Reviewed by ADMIN
on
March 21, 2018
Rating:
No comments: