అధ్యక్షా..!!! మా రైతు సమస్యలు పరిష్కరించండి..- అసెంబ్లీలో ఎమ్మెల్యే కురుగొండ్ల...
The bullet news ( Nellore)_ వెంకటగిరి నియెాజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు.. ముఖ్యంగా రైతుల సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు.. సోమశిల-స్వర్ణముఖి లింక్ కాలువ పనుల త్వరతిగతిన పూర్తి చేయించి రైతులకు సాగు నీరు అందిచాలని మరియు కాలువ నిర్మాణ పనులు వలన చెలికంపాడు గ్రామ రైతులు నష్టపోయిన పంటపోలాలకు నష్టపరిహరం అందించాలని కోరారు..దాంతో పాటు పెండింగులో ఉన్న పారవోలు, చెలికంపాడు గ్రామలకు పంటపొలాలకు మధ్య నిర్మించిన కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు..ఓటి స్లుయిస్ ల నుండి చెరువులకు లింక్ కాలువల పై అంచనాలు తయారు చేసి వెంటనే చెరువులక లింకు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని చెరువులకు మళ్ళంచవచ్చునని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు..ఈ కాలువ పనులు పూర్తి చేయటం వలన నెల్లూరు,చిత్తూరు జిల్లాలలో 79 వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు..నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి , గూడురు, సుళ్ళూరుపేట నియెాజకవర్గంలో 59 వేల 746 ఎకరాలకు సాగునీరు అందచేయుచ్చన్నారు.. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఆయన కోరారు..
అధ్యక్షా..!!! మా రైతు సమస్యలు పరిష్కరించండి..- అసెంబ్లీలో ఎమ్మెల్యే కురుగొండ్ల...
Reviewed by ADMIN
on
March 21, 2018
Rating:
No comments: