ఓ తండ్రి ఆవేదన..
The bullet news (Nellore)- పోలీసుల వేధింపులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి కంటతడి పెట్టారు.. తాను పోలీసులకు సహకరిస్తున్నా.. అజ్ణాతంలోకి వెళ్లానని, అరెస్టులు చేస్తామంటూ లీకులిస్తూ తమ కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.. నెల్లూరు పార్టీ కాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు.. కోటంరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లాడంటూ క్రైమ్ ఓఎస్డీ మీడియాకు ఇస్తున్న లీకులు వల్ల బెంగుళూరులో ఉన్న తన పెద్దకూతురు తీవ్ర మనోవేదన గురవుతుందని వాపోయారు.. తొమ్మిదినెలల గర్భంతో ఉన్న తన కుమార్తె బాదపడుతూ తనకు ఫోన్ చేసిందని, పోలీసు డ్యూటీ చేయకుండా పొలిటికల్ డ్యూటీలు చేస్తున్న పోలీసులకు తగిన బుద్ది చెబుతానన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటానన్నారు..
ఓ తండ్రి ఆవేదన..
Reviewed by ADMIN
on
March 10, 2018
Rating:
No comments: