భద్రతకు చిరునామా సీఐఎస్‌ఎఫ్
The bullet news(cisf)- ఎముకలు కొరికే చలిలో తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తారు.. చీమచిటుక్కుమన్నా నిమిషాల వ్యవధిలో అక్కడ వాలిపోతారు.. చోరులను పట్టుకునేందుకు అంబూష్ వేసి, రోజుల వ్యవధిలోనే ఇటే పట్టేస్తారు.. ప్రముఖుల భద్రతకు.. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు వారికి సాటి మరెవ్వరూ లేరు.. వారే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం..(సీఐఎస్‌ఎఫ్). మన జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్ర భద్రత వారి చేతుల్లో ఉంది. రాకెట్ కేంద్రం విస్తీర్ణం 43,360 ఎకరాలు (175 చదరపు కిలోమీటర్లు). భయకరమైన అడవి. ఇటీవల కాలంలో పులులు సైతం ఉన్నట్లు గుర్తించారు. ఓ వైపు పులికాట్ సరస్సు, మరో వైపు బంగాళాఖాతం.. మధ్యలో శ్రీహరికోట. ఈ రాకెట్ కేంద్రాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. కేవలం వెయ్యి మందితో రక్షణ చర్యలు చేపట్టడం సవాల్‌తో కూడిన పనే.. సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఏటా మార్చి 10న నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కథనం. మొదటిగా కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్) 1969 మార్చి 10న 2,800 సిబ్బందితో ప్రారంబÅమైంది. ఇది కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో పనిచేస్తోంది. ఏటా మార్చి 10న సీఐఎస్‌ఎఫ్ యూనిట్లు ఉన్న చోట వ్యవస్థాపక దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అదే తరహాలోనే దిల్లీలో దేశీయస్థాయిలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన, విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పతకాలు అందిస్తుంటారు. దేశ వ్యాప్తంగా 277 సీఐఎస్‌ఎఫ్ యూనిట్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1.66 లక్షల మంది వరకు వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారు. రానున్న రెండేళ్లలో సీఐఎస్‌ఎఫ్ భద్రత దళాల సంఖ్య 2 లక్షలకు చేరాలన్నది లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
శ్రీహరికోట సీఐఎస్‌ఎఫ్ యూనిట్ : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్) యూనిట్‌ను 1973 ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ కేవలం 157 మందితో భద్రత చర్యలు చేపట్టారు. కాలక్రమేణ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఐదేళ్ల కిందట ఆ సంఖ్య 940 మందికి చేరింది. ప్రస్తుత భద్రత చర్యల్లో భాగంగా శ్రీహరికోట సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌లో 1,340 మంది సిబ్బంది ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మరికొన్ని నెలల్లో అమల్లోకి రానుంది. ఈ మేరకు సిబ్బంది నియామకాలు కూడ జరగనున్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం 43,360 ఎకరాలు విస్తరించి ఉంది. ఇక్కడ సముద్ర తీరం 50 కిలోమీటర్లు, పులికాట్ సరస్సు 56 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. శ్రీహరికోటలో 24 గంటలూ పెట్రోలింగ్ జరుగుతోంది. సీఐఎస్‌ఎఫ్‌లో మహిళలు సైతం పురుషులకు దీటుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మ సైర్థ్యంతో వారు ముందుకెళ్లుతున్నారు. శ్రీహరికోటలో వివిధ కేటగిరిల్లో మహిళలు పనిచేస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి సీనియర్ కమాండెంట్ వరకు పనిచేసిన వారు ఉన్నారు. శ్రీహరికోట సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌లో 2001 సెప్టెంబరు 17వ తేదీ నుంచి నుంచి 2002 నవంబరు 17వ తేదీ వరకు అలకానంద దాస్ అనే మహిళా కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. ఇండోర రేవతి అనే మహిళ సహాయ కమాండెంట్‌గా శ్రీహరికోటలో పనిచేశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర పారిశ్రామిక భద్రత దళం(సీఐఎస్‌ఎఫ్) సెక్టార్లు ఆరు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. తూర్పు సెక్టార్ (పాట్నా), ఉత్తర సెక్టార్ (న్యూదిల్లీ), పశ్చిమ సెక్టార్ (ముంబయి), దక్షిణ సెక్టార్ (చెన్నై), నార్త్ ఈస్ట్రన్ సెక్టార్ (కోల్‌కతా) ఎయిర్ పోర్టు సెక్టార్ (న్యూ దిల్లీ). కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు (సీఐఎస్‌ఎఫ్) దేశంలోని భారత పార్లమెంటు, విమానాశ్రయాలు, తిరుమల, అంతరిక్ష కేంద్రాలు, స్టీలు కంపెనీలు, ఐబీ టెర్నియల్ పాయింట్లు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, దిల్లీ మెట్రో, జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు కేంద్రాలు, కరెన్సీ ముద్రణా కేంద్రాలు, డిఫెన్స్, తదితర ప్రాంతాల్లో భద్రత విధులు నిర్వహిస్తున్నారు. శ్రీహరికోటలోని సీఐఎస్‌ఎఫ్ దళాలు స్వచ్ఛ భారత్‌లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. సూళ్లూరుపేట, శ్రీహరికోట ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌లో భాగంగా వీధులను శుభ్రపరిచడం, మొక్కలు నాటడం, తదితర పనులను సైతం చేపట్టారు. అలాగే స్వచ్ఛ భారత్‌లో భాగంగా అవగాహన ర్యాలీలు సైతం నిర్వహించారు.

Reviewed by ADMIN
on
March 10, 2018
Rating:
No comments: