అక్రమాలకు రాజకీయ అండ
The bullet news(nellore)- నీరు- చెట్టు పనుల్లో గుత్తేదారులపై నీటి పారుదల శాఖ ఇంజినీర్లు హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు పట్టణంలో అభివృద్ధిలో భాగంగా భారీగా కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు. వీటితోపాటు నెల్లూరు చెరువు కట్ట(బండ్)ను పటిష్ట పరిచేందుకు Rs.2.48 కోట్లతో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. సుమారు 15 సంవత్సరాల తరువాత మొదలు పెట్టిన నెల్లూరు చెరువు కట్ట పనులఅడ్డగోలుగా గుత్తేదారులు, ఇంజినీర్లు చేయడం పరిశీలనలో బయటపడింది. నీరు చెట్టు పనుల్లో జరుగుతున్న లోపాలు బహిర్గతం కావడంతో వాటాల శాతం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మట్టి పనులు కావడంతో వాటిని అంచనాలు వేసిన సమయం నుంచి ఎంబుక్‌లో నమోదు వరకు క్షేత్రస్థాయిలో ఏఈలు చెప్పిందే వేదంగా గుత్తేదారులు పనులు చేయాలి. ఇందులో భాగంగా నెల్లూరు చెరువు కట్ట పనులు ప్రధాన గుత్తేదారు నుంచి ఇతరులకు అప్పగించినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ప్రధానంగా ధన, రాజకీయ సిఫార్సులు నీటి పారుదల శాఖలోని కొంత మంది ఇంజినీర్లు అడ్డం పెట్టుకుని దీర్ఘకాలంగా ఒకే డివిజన్‌లో పాతుకుపోయారు. నెల్లూరు సెంట్రల్ డివిజన్ పరిధిలోని నెల్లూరు డివిజన్‌లో జరగుతున్న పనుల్లో వాటాలు పెరగడంతోనే అస్తవ్యస్తంగా జరుగుతున్నట్లు పలువురు గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు.పనుల అంచనాల అధారంగా 25 శాతం క్వాలిటీ కంట్రోల్‌కు, మరో శాతం అదనంగా ఇవ్వాల్సి ఉంది. గుత్తేదారులు రికార్డు చేసిన పనులను పక్కన పెట్టి ముందు ఇంజినీర్ల వాటాలు పంపకాలు చేయల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్నా వీటిని నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నెల్లూరు చెరువు కట్ట రూపురేఖలు మారిపోయినప్పటికీ నిన్నటి వరకు ఇంజినీర్లు , లస్కర్‌లు పట్టించుకోలేదు. వెంకటగిరి నియోజకవర్గంలో నీరు చెట్టు పనులు పూర్తి చేసి అందరికీ వాటాలు పంపకాలు చేయడం, క్వాలిటీ కంట్రోలు వేధింపులు తట్టుకోలేక ఇద్దరు గుత్తేదారులు నెల్లూరు అవినీతి నిరోధక శాఖను అశ్రయించారు. అది జరిగి అరు నెలలు కూడా గడవకముందే ఇక్కడ ఇంజినీర్ల వాటాల వేధింపులు గుత్తేదారులు తట్టుకోలేకపోతున్నారు. గతంలో నీరు -చెట్టు పనుల్లో అవకతవకలపై జరిగిన ప్రత్యేక విచారణలో నాణ్యత ప్రమాణాలు లోపించడం, చేయకుండానే రాజకీయ సిఫార్సులు అడ్డం పెట్టుకుని ఎంబుక్‌లు సిద్దం చేసినట్లు తేలింది. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ జానకి ఎస్‌ఈపై బదిలీ వేటు వేశారు. అంతకు ముందు విజిలెన్సు అదనపు ఎస్పీ నేతృత్వంలో జిల్లాలో జరిగిన కోట్ల రూపాయల పనుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు మొదటి విడత గా విజిలెన్సు నివేదిక అందచేశారు. కేవలం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో నాయకుల అండతో పలువురు ఇంజినీర్లు దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పెత్తనం చేయడం సంచలనం రేపుతోంది. నెల్లూరు టౌన్ డివిజన్‌లో 15 కాలువల్లో పూడిక తీసేందుకు నీటిపారుదల శాఖ ఇటీవలి కాలంలో పనులు చేపట్టింది. పర్యవేక్షణ లోపంతో అడ్డగోలుగా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చెరువు కట్టను పరిశీలిస్తున్నాం : ప్రసాద్‌రావు,ఎస్‌ఈ
నీరు చెట్టు కింద జరుగుతున్న నెల్లూరు చెరువు కట్ట పనులను పరిశీలిస్తున్నాం. పనులు సక్రమంగా జరగని ప్రాంతాల్లో తిరిగి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పనుల్లో వాటాల గురించి తెలయదని, ఏఈతో మాట్లాడాలి. గుత్తేదారుల నుంచి ముందు వాటాలు తీసుకునే దానిపై పరిశీలన చేస్తాం.
నీరు చెట్టు కింద జరుగుతున్న నెల్లూరు చెరువు కట్ట పనులను పరిశీలిస్తున్నాం. పనులు సక్రమంగా జరగని ప్రాంతాల్లో తిరిగి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పనుల్లో వాటాల గురించి తెలయదని, ఏఈతో మాట్లాడాలి. గుత్తేదారుల నుంచి ముందు వాటాలు తీసుకునే దానిపై పరిశీలన చేస్తాం.
అక్రమాలకు రాజకీయ అండ
Reviewed by ADMIN
on
March 10, 2018
Rating:
No comments: