చెంతనే నది.. తీరని దాహార్తి
The bullet news(water)- పక్కనే నది.. కానీ నదిని ఆనుకొని ఉన్న గ్రామాలకు చుక్క తాగునీరు దొరకడం లేదు. ఇదేమిటి నది పక్కన ఉంటే తాగునీరు లేకపోవడమేమిటా అని అనుకుంటున్నారు కదూ! అదేమరి విశేషం. వర్షాలు లేకపోవడం, ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారాయి. దీంతో రూ.10 కోట్లతో ఏర్పాటుచేసిన రక్షిత పథకం ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. దప్పిక తీర్చుకోవడానికి నదీ తీరంలోని గ్రామాల ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ మండలంలోని పరిస్థితి. నది చెంతనే గ్రామం ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు లేదు. రూ.10 కోట్లతో ఈ ప్రాంతం నుంచే తాగునీటి సరఫరా జరుగుతున్నా భూగర్భ జలాలు రావడంతో ఉపయోగం లేకుండాపోయింది. దీంతో దప్పిక తీర్చుకోవడానికి నది తీరంలోని గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. మండలంలోని ముదివర్తిపాళెం గ్రామంలో ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకం ద్వారా 10 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేసేందుకు పైలెట్ ప్రాజెక్టును 12 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ప్రారంభంలో బాగున్నా ఇటీవల నదిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు, వర్షాలు లేక పెన్నాలో పారుదల లేకపోవడంతో పాటు రొయ్యలు చెరువులు భారీగా ఉన్నాయి. వీటికితోడు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న సముద్రపు నీరు పోటుతో నీటి పథకాల వద్దకు రావడంతో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోయాయి. ఈ విషయాన్ని గత ఏడాదే గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కోట్ల రూపాయతో బోర్లు వేశారు. అయినా లాభం లేదు. వేసవి కావడంతో దాహర్తి తీర్చుకొనేందుకు ప్రజలు నీటి క్యాన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని సముద్రతీర ప్రాంతాలైన కుడితిపాళెం, రాముడుపాళెం, గంగపట్నం, కొరుటూరు గ్రామాలతోపాటు సోమరాజుపల్లి, నరసాపురం, కొమరిక, పున్నూరు గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఈనీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడంతో తాగలేకపోతున్నారు. అధికారులు తక్షణం స్పందించి తమకు తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. శనివారం ఈనాడు-ఈటీవీ పరిశీలనలో గ్రామానికి వెళ్లగా మహిళలు తమ ఆవేదన వ్యక్తంచేశారు. నదిలో యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనివల్ల తాగునీటి కష్టాలు వస్తున్నాయి. నీటిలో ఉప్పు శాతం పెరిగి కనీసం గుక్కెడు మంచినీరు లభించని పరిస్థితి నెలకొంది.ముదివర్తిపాళెం- ముదివర్తి గ్రామాల మధ్య పెన్నా నదిపై చెక్‌డ్యాం నిర్మిస్తే రెండు మండలాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుంది. గతంతో రూ.100 కోట్లతో అధికారులు దీనికి ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ చెక్‌డ్యాం నిర్మిస్తామని హామీలిస్తున్నారు. ఆ తర్వాత మరిచిపోతున్నారు. దీంతో ప్రభుత్వాలు మారుతున్నా పని జరగటం లేదు. శాసనసభలో ముదివర్తి-ముదివర్తిపాళెం చెక్‌డ్యాం ఆవశ్యకతను తెలియజేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తా. ప్రస్తుతానికి వెంటనే అధికారులను పంపించి తాగునీటికి సత్వర పరిష్కారం చేపట్టేలా చేసి సమస్య తీరుస్తాను.
చెంతనే నది.. తీరని దాహార్తి
Reviewed by ADMIN
on
March 16, 2018
Rating:
No comments: