రైతులకు అన్యాయం చేస్తే కాలర్ పట్టుకుని నిలదీస్తా..- ఎమ్మెల్యే కాకాణి
THE BULLET NEWS (SARVEPALLI)-‘నీరు-చెట్టులో దోచుకున్నావ్.. పసుపు కుంభకోణంలో పిండుకున్నావ్.. అన్నింటా దోపిడే లక్ష్యంగా పనిచేశావ్.. ఇప్పుడు మిల్లర్లతో కుమ్మకై మద్దతు ధర విషయంలో రైతులను మోసం చేస్తున్నావ్..సోమిరెడ్డి.. రైతుల విషయంలో రాజకీయాలోద్దు.. మా రైతులకు అన్యాయం జరిగితే కాలర్ పట్టుకోని నిలదీస్తానంటూ... నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణిగోవర్దన్ రెడ్డి వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డిపై మరోసారి పైరయ్యారు.. టీడీపీ గూడూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మంత్రి సోమిరెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నట్ఠేటా ముంచిందన్నారు.. ఎన్నికలకు ముందు స్వామినాధన్ కమిటి సిఫారసులను అమలు చేస్తామని, 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏరుదాటి తెప్పతగలేసిన చందాన టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో అన్యాయం జరిగితే కాలర్ పట్టుకోని నిలదీస్తానన్నారు.. గిట్టుబాటు ధర లేక, అప్పులు ఊబిలో రైతులు కొట్టిమిట్లాడుతున్నారని తాము ఆవేదన చెందుతుంటే.. మిల్లర్లు సంక్షోభంలో ఉన్నారని మంత్రి సోమిరెడ్డి ఆవేదన చెందడం ఆయన మిల్లర్లతో కుమ్మకు అయ్యారని చెప్పడానికి నిదర్శనమన్నారు.. రైతుల శ్రేయస్సు ముఖ్యమా లేక మిల్లర్ల ముఖ్యమో సోమిరెడ్డి తేల్చుకోవాలన్నారు.. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు.. మంత్రి సోమిరెడ్డి నీతిమంతుడైతే.. కామినేని శ్రీనివాస్ లాగా కాణిపాకం వెళ్లి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా అవినీతి కట్టిబెట్టి రైతులకు మద్దతు దర వచ్చేలా క్రుషి చేయాలని హితవు పలికారు..
రైతులకు అన్యాయం చేస్తే కాలర్ పట్టుకుని నిలదీస్తా..- ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
March 20, 2018
Rating:
No comments: