తప్పులమయం
The bullet news(nellore)- *పదోతరగతి హాల్‌టికెట్లలో అడ్రస్‌ల గల్లంతు *వెతుక్కోలేక విద్యార్థుల ఇబ్బందులు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పంపిణీ చేసిన హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయి. ఎస్‌ఎస్‌సీ బోర్డు ఇష్టారీతిగా ముద్రించి పంపింది. గురువారం నుంచి పరీక్షలు జరుగనున్నాయి. గతంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పదిరోజుల ముందే హాల్‌టికెట్లు పంపేది. వాటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఈ ఏడాది విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పోయి ందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తక్కువ వ్యవధిలో పరిశీలించి సవరించుకోవడం ఏవిధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హాల్‌టికెట్లలో తప్పులుంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్ చేయిస్తే సరిపోతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయం విద్యార్థులకు తెలియకపోవడంతో రోజుల తరబడి విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు అందుబాటులోలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 33,100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలామంది హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం పేరు మాత్రమే ఉంది. ఆ పాఠశాల ఏ ప్రాంతంలో ఉందో అడ్రస్ లేదు. పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థుల చేతిలోపెట్టి మీరే అడ్రస్ వెతుక్కోండని చేతులు దులుపుకున్నాయి. విద్యార్థులకు ఇచ్చిన హాల్‌టికెట్లలో ఉండే కోడ్‌ను పరీక్షల యాప్‌లో టైప్ చేస్తే కేంద్రం అడ్రస్ తెలుస్తుంది. హాల్‌టికెట్లు ఇవ్వని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల విషయం మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తప్పులమయం
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: