ఫలితాలు రాకముందే.మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నా క్షమించండి..
The bullet news(crime)- సారీ మమ్మి... సారీ డాడీ... మీ ఆశలు నెరవేర్చలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా... అంటూ సెల్ఫీ వీడియో లో చిత్రీకరించుకుని శనిగరం చందన(17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. ఇంతేజార్‌గంజ్ సీఐ సుంకర రవికుమార్ విలేకరులకు తెలిపిన ప్రకారం... వరంగల్ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన శనిగరం సతీష్ కు ఇద్దరు కుమార్తెలు ఉండగా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. పోచమ్మమైదాన్ సెంటర్‌లోని ఒక ప్రయివేట్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న చందన బుధవారం పరీక్షలు ముగిశాయి.
పరీక్ష రాసివచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్న చందన ఇంట్లోనే పడుకుంది. మధ్యాహ్నం తల్లిదండ్రులు, చెల్లె వర్ష ఫంక్షన్ వెళ్తూ చందనను రమ్మనగా ఇంట్లోనే ఉంటానని చెప్పటంతో వారంతా వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఫంక్షన్‌కు పోయాక చందన్ ఆత్మహత్య చేసుకునేముందు తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంది. సారీ మమ్మి... సారీ డాడి... మీ ఆశ లు నెరవెర్చలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా.. మమ్మి ఐ మిస్ యు.. డాడీ ఐ మీస్ యు.. వర్ష ఐ మీస్ యు అంటూ సెల్ఫీ రికార్డు చేసి లోపలి నుంచి గడియపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే ఫంక్షన్ నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరువాలని పిలిచినా, ఫోన్ చేసినా చందన నుంచి సమాధానం రాకపోవటంతో అనుమానంతో తలుపులు పగులగొట్టగా చందన ఉరేసుకుని కనిపించిందని సీఐ చెప్పారు. సీఐ రవికుమార్, ఎస్సై ఎం.శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాత్రి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, ఇంతేజార్‌గంజ్ ఎస్సై ఎం.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫలితాలు రాకముందే.మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నా క్షమించండి..
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: