లాలూకి సీబీఐ షాక్...
THE BULLET NEWS (NEW DELHI)-బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇవాళ రాంచీ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయనను దోషిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మరో 30 మంది ప్రమేయం కూడా ఉన్నట్టు తేల్చింది. డిసెంబర్ 1995 నుంచి జనవరి 1996 మధ్య అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ.. దుంబా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసినట్టు నేరం రుజువైందని కోర్టు పేర్కొంది.
కాగా ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. కాగా శనివారం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఇవాళ తీర్పు సందర్భంగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పటికే దాణా కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో లాలూకి 13.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిశ్రా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: