పార్లమెంట్ ప్రాంగణంలో గృహిణి వేషధారణ లో ఎంపీ శివప్రసాద్
THE BULLET NEWS (NEW DELHI)-టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ ప్రాంగణంలో వినూత్నతరహాలో ఆందోళన చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశంలోని మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన ఆయన ఓ గృహిణి వేషధారణతో నిరసన తెలిపారు. తిరుమల వెంకన్న, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. బంగారు నగలను లాక్కునే ప్రయత్నం చేస్తున్న మోదీ ఇకపై విదేశాల్లోనే స్థిరపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ మహిళలు జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారని అన్నారు. మోదీ నిర్ణయాల వల్ల ఏపీలో మహిళలు నిరాశతో, కోపంగా ఉన్నారని ఆయన చెప్పారు.
టీడీపీతో జతకట్టిన మోదీ.. వెంకన్న, దుర్గమ్మ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ప్రధానమంత్రి అయిన తర్వాత అన్నీ మర్చిపోయారని, మొదట్లో హోదా అన్నారని, తర్వాత ప్యాకేజీ అన్నారని.. ఇప్పుడు అదీలేదని శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అన్నీ ఇచ్చామని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దు పేరుతో చేతిలో డబ్బులు లేకుండా చేశారని, చిల్లర కూడా దొరకని పరిస్థితి మహిళలకు వచ్చిందని, సంసారాన్ని గడపాల్సిన మహిళలు... ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తమ డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుని డ్రా చేసుకోలేని పరిస్థితిని మోదీ కల్పించారని, జీఎస్టీతో ప్రజలు భయపడిపోతున్నారని ఆయన మండిపడ్డారు. మహిళలపై కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని బంగారు ఆభరణాలపై నిబంధనలు పెట్టాలని చూశారని, భారత మహిళల్లో అభద్రతా భావం వచ్చిందని శివప్రసాద్ పేర్కొన్నారు.

Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: