మంత్రి సోమిరెడ్డి పై మరోసారి బాంబ్ పేల్చిన ఎమ్మెల్యే కాకాణి
The bullet news ( Nellore) _
రాజకీయ ప్రత్యర్దులైన సోమిరెడ్డి వర్సెస్ కాకాణి వ్యవహారం మరోసారి జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.. వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు.. రైస్ మిల్లర్ల వద్ద నుంచి మంత్రి సోమిరెడ్డి 50కోట్లు రూపాయలు దండుకున్నారని ఆరోపణలు చేసిన వారం తిరక్కముందే మరో బాంబు పేల్చారు కాకాణి.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు..
వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగలో నిరుపేదలకు చెందిన 13.7 సిజేఎప్ ఎస్ భూములును డీ ఫారాలు స్రుష్టించి 3 కోట్ల రూపాయల కుంభకోణానికి మంత్రి సోమిరెడ్డి యత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు.. మంత్రి ఒత్తిడితోనే ఈ భూములకు నకిలీ డాకుమెంట్స్ సృష్టించి పరిహారం చెల్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.. నిరుపేదలకు చెందిన ఈ భూములను మంత్రి అనుచరులు పరిహారం నొక్కేసేందుకు రంగం సిద్దమైందన్నారు. జిల్లాలో జరిగే అన్ని కుంభకోణాల్లో మంత్రి సోమిరెడ్డి పాత్రుందని కాకాణి ఆరోపించారు.. అవినీతి అక్రమాలకు పాల్పడే సోమిరెడ్డి మంత్రిగా పనికిరారని, ఆయన్ని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరప్ చేయాలని కాకాణి డిమాండ్ చేశారు.

Reviewed by ADMIN
on
March 21, 2018
Rating:
No comments: