బిజేపీతో తెగదెంపులు చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు - నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
The bullet news (Nellore)- మాటిచ్చి మోసం చేసిన ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావడాన్ని రాష్ట ప్రజలు స్వాగతిస్తున్నారని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. స్థానిక కోటమిట్టలోని షాదీ మంజిల్ నూతన నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. బిజేపీపై రాష్ట ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారన్నారు.. దేశవ్యాప్తంగా ముస్లిం, మైనార్టీ ప్రజల హక్కులను ధిక్కరిస్తూ బిజేపీ నాయకుల బాబ్రీ మసీదును విధ్వంసం చేస్తే ముస్లీం,మైనార్టీలకు అండగా మాట్లాడిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడున్నారు.. అప్పట్లో బీజేపీ జాతీయ నాయకుల జాబితాలో కీలక స్థానం వహించిన ప్రస్తుత ప్రధాని మోదీ జాతీయ సమైక్యతా వాదాన్ని ప్రశ్నించిన చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పురోగామివృద్ధి సాధిస్తుందని మేయరు ఆశాభావం వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీ వర్గాల దయనీయమైన జీవన స్థితిగతులకు ప్రత్యక్షంగా బీజేపీ ప్రభుత్వమే కారణమనీ, ఆ పార్టీ నుంచి విడివడడంతో జాతీయ స్థాయిలో ముస్లిం ప్రజల మన్ననలను చంద్రబాబు అందుకున్నారని మేయరు సంతోషం వ్యక్తం చేసారు.
బిజేపీతో తెగదెంపులు చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు - నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
Reviewed by ADMIN
on
March 18, 2018
Rating:
No comments: