ప్రియురాలి తో కలిసి ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు..
THE BULLET NEWS (VIJAYAWADA)-
వారిద్దరికీ వివాహాలయ్యాయి... అతని కాపురం సజావుగా సాగుతుండగా, ఆమెను భర్త వేధిస్తున్నాడు. ఇద్దరి మధ్య అనుకోని పరిచయం వివాహేతర సంబంధం వైపునకు నడిపించింది... వెనకాముందు ఆలోచించకుండా ఇద్దరూ కుటుంబాలను సైతం వదిలి ఏకాంతం కోసం వెళ్లిపోయారు... ఇరు కుటుంబాల పెద్దలు, పోలీసులు వారికి సర్దిచెప్పి ఎవరిళ్లకు వారిని పంపించారు... ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారో...? లేక జరిగిన తప్పుకు అవమానంగా భావించారో...? తెలియదు కానీ ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హోంగార్డు, అతని ప్రియురాలు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం నగరంలో చర్చానీయాంశమైంది.
పోలీసుల కథనం ప్రకారం అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన కనగల శ్యామ్‌ప్రసాద్ (37) వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన ఇతనికి మధురానగర్‌కు చెందిన నూర్జహాన్(38)తో పరిచయం ఏర్పడింది. తన భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టడానికి వచ్చిన ఆమెకు కేసు విషయంలో సహకరించిన శ్యామ్‌తో సానిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకుని నాలుగురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రియురాలి భర్త సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురినీ పిలిపించిన అధికారులు వారిని హెచ్చరించి శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించి ఇళ్లకు పంపారు.
ఆదివారం ఉదయం స్టేషన్‌లో కనిపించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన హోంగార్డు శ్యామ్ పాయకాపురం కండ్రిక కాలనీ శివారు పంటపొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం నూర్జహాన్ కూడా మధురానగర్‌లోని తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరి ఆత్మహత్యతో పండుగ నాడు రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన నున్న రూరల్ సీఐ ఎం.వి.దుర్గారావు, సత్యనారాయణపురం ఎస్సై ప్రసాద్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: