పవన్ కల్యాణ్‌ది ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ పార్టీ -మంత్రి కేఎస్ జవహర్
THE BULLET NEWS -జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుపై టీడీపీ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.పవన్ కల్యాణ్‌ది ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ పార్టీ అని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఏలూరులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హోదా కోసం సీఎం రాజీలేని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. అజ్ఞాతవాసి వెలుగులోకి వచ్చి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని, ఇతరుల స్ర్కిప్టులు చదివి తమపైౖ బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తిరుమలలో విమర్శించారు. సినిమా స్ర్కిప్ట్‌కు, రాజకీయాలకు పవన్ తేడా తెలుసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో సూచించారు. రాష్ట్రానికి సాయం చేయాల్సిన కేంద్రాన్ని నిలదీయకుండా సీఎంను తిట్టడమేంటని ప్రశ్నించారు. బీజేపీ... భారతీయ జగన్ సేన పార్టీగా మారిపోయిందని గంటా విమర్శించారు. ఇదిలావుండగా, పవన్‌కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమాకో డైలాగులా పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి లేనివాళ్ల మాటలను పట్టించుకోబోమని విజయవాడలో అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమాకో డైలాగులా పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి లేనివాళ్ల మాటలను పట్టించుకోబోమని విజయవాడలో అన్నారు.
పవన్ కల్యాణ్‌ది ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ పార్టీ -మంత్రి కేఎస్ జవహర్
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: