ఎస్పీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి..
The bullet news (Nellore)- ’ఎస్పీ గారూ.. మీరు నిజాయితీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు.. ఆత్మసాక్షిని చంపుకుని డ్యూటీ చేస్తున్నారు.. మంత్రుల ఆదేశాలను పాటిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు.. సిబ్బందిని మానసిక వేధనకు గురిచేస్తూ వారి చావులకు కారణమవుతున్నారు. మీకు దమ్ముంటే మీరు చార్జి తీసుకున్నప్పటి నుంచి జరిగిన అక్రమాలపై, క్రికెట్ బుకీల కాల్ లిస్ట్ పై హైకోర్టుకు వెళ్దామంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణపై వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్ది శ్రీధర్ రెడ్డి తీవ్ర స్తాయిలో ఆరోపణలు గుప్పించారు..
తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎస్పీ వ్యవహారశైలి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ జ్ణానంలేని మంత్రి నారాయణ ఆదేశాలను ఎస్పీ ఆచరిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.. గతంలో నంద్యాల ఉపఎన్నికల సందర్బంగా నోటీసులిచ్చి ఇబ్బందిపెట్టారని, ఇవాళ రాజ్యసభ నామినేషన్ ఉండటంతో ఇవాళ కూడా కావాలనే నోటీసులు జారీ చేశారని ఆయన విమర్శించారు.. మంత్రలు అజెండా ప్రకారమే ఎస్పీ పనిచేస్తున్నారని ఆరోపించారు.. నిజాయితీ ముసుగులో ఎస్సీ సిబ్బందని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.. ఎస్సీ వేధింపులు తట్టుకోలేక ఓ సిఐ చనిపోయారని, చాలా మంది మానసిక వేధనకు గురవుతున్నారన్నారు.. పచ్చచొక్క వేసుకున్న పిహెచ్ డీ రామకిష్ణకు దమ్ము, దైర్యం ఉంటే సిబ్బంది ఆత్మహత్యలపై జ్యుడీషియల్ విచారణకు వెళ్లాలని డిమాండ్ చేశారు.. క్రికెట్ బుకీల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు ఫోన్లు వెళ్లాయో ఇద్దరం హైకోర్టుకు వెళ్దామని ఇందులో తన తప్పుందని తేలితే శాశ్వత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు.. ఒఎస్డీ విఠలేశ్వర్ చేసి దందా ఎస్పీకి తెలీదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు..

Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: