అన్నదాతలను ఆదుకుంటాం - సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
The bullet news (Manubolu)_ అకాల వర్షం రైతన్న ఆశయాలను అడియాశలు చేసింది.. రైతులెవ్వరూ అదైర్యపడొద్దు.. నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపడతామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.. గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా మనుబోలు, మడమనూరు, గొట్లపాళెం, మనుబోలులో తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ఆయన పరిశీలించారు.బైక్ పై తిరుగుతూ నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షంతో రైతులు నష్టపోయారన్నారు.. పంట చేతికొచ్చిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమన్న ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి సోమిరెడ్డి దృష్టికి తీసుకెళుతున్నామన్నారు.. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి సోమిరెడ్డి ఫోన్ లోనే అధికారులతో సమీక్ష నిర్వహించారని, నష్టం అంచనాలు వేయడంతో పాటు
రైతుల కోసం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. తీవ్రంగా
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన
భరోసా ఇచ్చారు..
రైతుల కోసం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. తీవ్రంగా
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన
భరోసా ఇచ్చారు..
అన్నదాతలను ఆదుకుంటాం - సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: