గంట, శంఖుతో ప్రత్యేకహోదా కోసం వినూత్న నిరసన
The bullet news (Nellore)_ ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు హోరెత్తుతున్నాయి.. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు.. నెల్లూరులో బేడ బుడగ జంగమ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు గంటా, శంఖు ఊదుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.. ప్రత్యేక హోదా వస్తే రాష్టం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెండు అవుతాయన్నారు.. ప్రధాని మోడీకి కనువిప్పు కలిగేందుకు గంట మోగిస్తూ.. శంఖు ఉదుతున్నామని వారు వెల్లడించారు.. పరమశివుడు మోడీ మనసు మార్చి హోదా ఇవ్వాలని వారు కోరారు.. అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు..
గంట, శంఖుతో ప్రత్యేకహోదా కోసం వినూత్న నిరసన
Reviewed by ADMIN
on
April 18, 2018
Rating:
No comments: