నంద్యాలలో కొనసాగుతున్న అంతర్గత పోరు.. ఆందోళనలో టిడిపి...
THE BULLET NEWS -అఖిలప్రియ బదులు వచ్చే ఎన్నికల్లో తనకు ఆ టిక్కెట్ ఇవ్వాలని ఏవీ పట్డుబడుతున్నారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడినా సమస్య కొలిక్కి రాకపోవడంతో మరోసారి చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారు.
కర్నూలు జిల్లా నంద్యాల్లో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. భూమా, ఏవీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. భూమా ప్రాణ స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని మంత్రి అఖిల దూరం పెట్టడంతో ఏవీ ఆళ్లగడ్డ పై ఫోకస్ పెట్టారు. దివంగత నేతలు భూమా శోభా నాగిరెడ్డి దంపతులు.. నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత ఆమె కూతురు ఆళ్లగడ్డ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తూ భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిల ఇద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తరువాత భూమా హఠాన్మరణంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు భూమాకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఆయన ప్రాణ స్నేహితుడు ఏవీ.సుబ్బారెడ్డిని భూమా పిల్లలు దూరం పెట్టారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల తీరుతో ఏవీ వర్గం అసంతృప్తి గురైంది. పార్టీ గెలుపు కోసం విబేధాలు పక్కన పెట్టాలని అధినేత చంద్రబాబు ఇద్దరికీ క్లాస్ పీకారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా.. భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఎన్నికల తరువాత కూడా అఖిలప్రియ ఏవీని కలుపుకొని పోలేదు. ఇటీవలే ఆళ్లగడ్డలో భూమా ప్రథమ వర్ధంతి జరిగితే అఖిల ఏవీ ని పిలువలేదు. దీనిపై ఏవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అఖిల మీద బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఆళ్లగడ్డపై ఫోకస్ పెట్టారు. ఆళ్లగడ్డలో తన అనుచరులు కార్యకర్తలు మద్దతుదారులతో ఏవీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
ఇద్దరి మధ్య రేగుతున్న వివాదానికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల ను పిలిచి మాట్లాడారు. ఆళ్లగడ్డ స్థానం తనకు కేటాయించాలని బాబును కోరారు ఏవీ. భూమా కుటుంబానికి తాను చేసిన సేవను గుర్తుచేసారు. అయితే ఇద్దరూ విభేదాలు పక్కనపెట్టి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని బాబు సూచించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మరోసారి చర్చిస్తానని చెప్పారు. మొత్తానికి భూమా, ఏవీ వర్గాల విభేదాలతో నంద్యాల, ఆళ్లగడ్డలో టీడీపీ భవిష్యత్‌పై సందేహాలు మొదలయ్యాయి.

Reviewed by ADMIN
on
April 13, 2018
Rating:
No comments: