నిప్పో వ్యవహారాన్ని సీబీసీఐడీ తో విచారణ జరపాలి.. - ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్
The bullet news ( Nellore ) _ నెల్లూరులో నిప్పో ప్యాక్టరీ భూముల వివాదం వేడిపుట్టిస్తోంది.. కౌన్సిల్ సమావేశంలో మేయర్ ఏకపక్షంగా నిర్వహించి, నిప్పో భూ బదలాయింపు వ్యవహారాన్ని క్యాబినెట్ కు వదిలేయడంపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.. నిప్పో భూములను ప్రజావసరాలకు వినియోగిస్తామని చెప్పిన మంత్రి నారాయణ ఇప్పుడు మాట మార్చడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. భూముల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని దానిపై సిబిసిఐడి ద్వారా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నిప్పో భూములను వెంటనే వెనక్కి తీసుకోకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు..
నిప్పో వ్యవహారాన్ని సీబీసీఐడీ తో విచారణ జరపాలి.. - ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్
Reviewed by ADMIN
on
April 13, 2018
Rating:
No comments: