హోదాపై దూకుడు పెంచిన వైసిపి...
THE BULLET NEWS (NEW DELHI)-ప్రత్యేక హోదా పోరాటంలో వైసీపీ దూకుడు పెంచింది. హస్తినలో రాష్ట్రపతిని కలిసిన ఆ పార్టీ ఎంపీలు... మోదీ సర్కార్ తీరుపై ఫిర్యాదు చేశారు. విభజన హామీల అమలు విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదిస్తారన్న ఎంపీలు.. ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామా.. అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. కేంద్రం వైఖరితో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో రాష్ట్రపతి కలగచేసుకోవాలని ఆ లేఖలో జగన్ కోరారు.
కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ ఎంపీలు... ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కన్నారు. హోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. సీఎం వైఖరితో ఏపీకి నష్టం వాటిల్లిందని విమర్శించారు. స్పీకర్ తమ రాజీనామాలను తప్పనిసరిగా ఆమోదిస్తారన్న ఎంపీలు.. ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
మరోవైపు కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ను... బుధవారం వైసీపీ ఎంపీలు కలవబోతున్నారు. రాష్ట్రపతితో చర్చించిన అంశాలపై జగన్‌కు వివరించనున్నారు. హోదా సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Reviewed by ADMIN
on
April 17, 2018
Rating:
No comments: