దోషులను బహిరంగంగా ఉరితీయాలి- నెల్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ
The bullet news (Nellore)_ కథువా ఘటనపై నెల్లూరులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. దోషులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్దులు, మహిళలు, రోడ్డెక్కుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.. ప్రభుత్వం ఈ ఘటనపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందిన ఆరోపిస్తున్నారు.. సీమాంద్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అద్యక్షులు ఉల్లిపాలయ శంకరయ్య ఆద్వర్యంలో ఇవాళ నెల్లూరులోని విఆర్సీ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడ్డ దోషులను బహిరంగంగా ఉరితీయాలని మహిళా నాయకులు పద్మజా డిమాండ్ చేశారు.. ఈ నిరసన ర్యాలీలో వందలాది మంది చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు..
దోషులను బహిరంగంగా ఉరితీయాలి- నెల్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ
Reviewed by ADMIN
on
April 19, 2018
Rating:
No comments: